టీమిండియా సెలక్టర్ల రేసులో అగార్కర్
- సీనియర్ సెలెక్షన్ కమిటీలో మూడు స్థానాలు ఖాళీ
- దరఖాస్తులు కోరిన బీసీసీఐ
- దరఖాస్తు చేసుకున్న అగార్కర్, మణీందర్, చేతన్ శర్మ, దాస్
కాగా, బీసీసీఐ ఎప్పటినుంచో సెలెక్టర్ల ఎంపికలో జోనల్ విధానం పాటిస్తోంది. సౌత్ జోన్, నార్త్ జోన్, సెంట్రల్ జోన్, వెస్ట్ జోన్, ఈస్ట్ జోన్ నుంచి ఒక్కొక్కరిని తీసుకునే సంప్రదాయాన్ని అనుసరిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో జరిపిన నియామకాల్లోనూ ఇదే విధానం ప్రకారం సునీల్ జోషి, హర్వీందర్ సింగ్ లను ఎంపిక చేసింది. అయితే, బీసీసీఐ నూతన రాజ్యాంగంలో జోనల్ విధానంపై నిర్దిష్టంగా పేర్కొనకపోయినా, ఐదుగురు అత్యుత్తమ కాండిడేట్లను సెలెక్టర్లుగా నియమించాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఎలా వ్యవహరిస్తుందన్నది చూడాల్సి వుంది.