హైదరాబాద్లోని రిలయన్స్ డిజిటల్లో భారీ దోపిడీ.. రూ. 40 లక్షల విలువైన సెల్ఫోన్ల చోరీ!
- మదీనాగూడలోని రిలయన్స్ షోరూంలో చోరీ
- దొంగతనం కారణంగా షోరూం మూసివేత
- నిందితుల కోసం ఐదు బృందాలతో గాలిస్తున్న పోలీసులు
దొంగతనం నేపథ్యంలో యాజమాన్యం నిన్న షోరూంను మూసివేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫోన్లతోపాటు ఇంకేమైనా చోరీకి గురయ్యాయా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నిత్యం రద్దీగా ఉండే జాతీయ రహదారిపై ఇంతపెద్ద దొంగతనం జరగడం స్థానికంగా చర్చనీయాంశమైంది. నిందితుల కోసం పోలీసులు ఐదు బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.