ఏపీ కరోనా బులెటిన్: 2,367 పాజిటివ్ కేసులు, 11 మరణాలు

Corona statistics of Andhra Pradesh
  • గత 24 గంటల్లో 80,082 కరోనా పరీక్షలు
  • తాజాగా 2,747 మందికి కరోనా నయం
  • యాక్టివ్ కేసుల సంఖ్య 21,434
ఏపీలో కరోనా ప్రభంజనం తగ్గుతోంది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 80,082 కరోనా పరీక్షలు నిర్వహించారు. కొత్తగా 2,367 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 386 కేసులు రాగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 37 కేసులు వెలుగు చూశాయి. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 11 మంది మృతి చెందారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 6,779కి పెరిగింది.

తాజాగా  2,747 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో ఇప్పటివరకు 8,40,730 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8,12,517 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 21,434 మంది చికిత్స పొందుతున్నారు.
Go Back to Shorts
Corona Virus
Andhra Pradesh
Update
Bulletin
Positive Cases
Deaths
Recovery

More Telugu News