మహిళలు స్నానం చేస్తుండగా వీడియోలు.. వాటిని చూపించి బ్లాక్‌మెయిల్!
- బాధిత మహిళ ఫిర్యాదుతో అరెస్ట్
- బెయిలుపై వచ్చి బాధిత కుటుంబంపై దాడి
- నిందితుడికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారంటూ గ్రామస్థుల ఆందోళన
గత నెల 18న ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నాలుగు రోజుల క్రితం బెయిలుపై విడుదలైన నిందితుడు తన సోదరుడితో కలిసి బాధితురాలి కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డాడు. అంతేకాక, వారిపైనే తిరిగి కేసులు పెట్టించాడు.
తమను వేధింపులకు గురిచేయడమే కాకుండా తమపైనే తిరిగి కేసులు పెట్టించడంపై బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఫిర్యాదును పట్టించుకోకుండా, తిరిగి నిందితుడికే పోలీసులు అండగా నిలుస్తున్నారని ఆరోపిస్తూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. అతడి వల్ల గ్రామంలో అశాంతి నెలకొందని, అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.