గుంటూరు జిల్లాలో ఘోరం.... కళ్లలో స్ప్రే చల్లి హత్య!
- 75 తాళ్లూరు గ్రామంలో ఘటన
- చెత్త పారేసేందుకు వెళ్లిన హోటల్ యజమాని
- బైక్ పై వచ్చి స్ప్రే చల్లిన దుండగులు
- ఆసుపత్రికి వెళుతూ మార్గమధ్యంలో మృతి చెందిన వ్యక్తి
అదే సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి బ్రహ్మయ్య ముఖంపై స్ప్రే చల్లి దాడి చేశారు. ఆ స్ప్రే కళ్లలో పడడంతో మంటలు పుట్టాయి. దాంతో కుటుంబ సభ్యులు బ్రహ్మయ్యను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించాడు. ఈ ఘటన పెదకూరపాడు మండలంలో తీవ్ర కలకలం రేపింది. బ్రహ్మయ్యను హత్య ఎవరు చేశారో, ఎందుకు చేశారో తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు.