తెలుగులో డబ్బింగ్ చెప్పిన మరో ముంబై భామ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలుగులో డబ్బింగ్ చెప్పిన మరో ముంబై భామ!

Aada Sharma dubs her self for her latest Telugu flick
  • ఇటీవల డబ్బింగ్ చెబుతున్న ముంబై భామలు
  • ఆదాశర్మ తాజా చిత్రం '?' (క్వశ్చన్ మార్క్)
  • తెలంగాణ అమ్మాయి పాత్రలో ముద్దుగుమ్మ
  • ఒక్క రోజులో డబ్బింగ్ పూర్తిచేసిన ఆదాశర్మ  
గతంలో ముంబై భామలు తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా.. ఇక్కడ ఎంతగా బిజీ అయినా సరే తమ పాత్రలకు తాము డబ్బింగు చెప్పుకోవడానికి ప్రయత్నించేవారు కాదు. ఎందుకంటే, డబ్బింగును పెద్ద తలనొప్పి వ్యవహారంగా ఫీలయ్యే వారు. అందుకే, హిందీ తారలు తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా డబ్బింగ్ మాట ఎత్తేవారు కాదు. అయితే, ఇప్పటి తారలు అందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. తమ పాత్రలకి తామే డబ్బింగ్ చెప్పుకోవడాన్ని ఒక గౌరవంగా.. బాధ్యతగా భావిస్తున్నారు.

ఈ క్రమంలో ఇప్పటికే పలువురు ముంబై భామలు తెలుగులో డబ్బింగ్ చెప్పి, ప్రశంసలు కూడా పొందారు. ఈ జాబితాలో ఇప్పుడు మరో కథానాయిక ఆదాశర్మ కూడా చేరింది. తొలిసారిగా ఈ ముద్దుగుమ్మ తెలుగులో డబ్బింగ్ చెప్పుకుంది. నూతన దర్శకుడు విప్ర దర్శకత్వంలో ఆదాశర్మ కథానాయికగా '?' (క్వశ్చన్ మార్క్) పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. ఇందులో ఈ చిన్నది తెలంగాణ ప్రాంతానికి చెందిన అమ్మాయిగా నటిస్తోంది. ఈ చిత్రానికి తాజాగా ఆదాశర్మ డబ్బింగ్ చెప్పింది.

 ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 'మన పాత్రకు మనం డబ్బింగ్ చెప్పుకుంటేనే దానికి సంపూర్ణత్వం వస్తుంది. అందుకే, ఎప్పటి నుంచో చెప్పాలని అనుకుంటున్నాను. భాష సరిగా అర్థమైతే డబ్బింగ్ మంచి ఎక్స్ ప్రెషన్స్ తో చెప్పచ్చు. నాకు తెలుగు బాగా వచ్చేసింది. అందుకే, ఒక రోజులోనే డబ్బింగ్ పూర్తిచేసేశాను' అని చెప్పింది.
Aada Sharma
Mumbai
Dubbing

More Telugu News