ఏపీ కరోనా అప్ డేట్: 2,618 కొత్త కేసులు, 16 మరణాలు
- గత 24 గంటల్లో 88,780 కరోనా టెస్టులు
- తాజాగా 3,509 మందికి కరోనా నయం
- ఇంకా 23,668 మందికి చికిత్స
ఇప్పటివరకు ఏపీలో 8,25,966 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 7,95,592 మంది కరోనా విముక్తులయ్యారు. ఇంకా 23,668 మందికి చికిత్స కొనసాగుతోంది. మొత్తమ్మీద రాష్ట్రంలో మునుపటి ఉద్ధృతి లేదన్నది ఇటీవలి గణాంకాలు చెబుతున్నాయి.