హైదరాబాదు పోలీసుల అదుపులో దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ బావమరిది!

01-11-2020 Sun 17:00 | Telangana
  • నవంబరు 3న దుబ్బాకలో ఉప ఎన్నికల పోలింగ్
  • నేటితో ముగియనున్న ప్రచారపర్వం
  • హైదరాబాదులో రూ.1 కోటి స్వాధీనం చేసుకున్న పోలీసులు
దుబ్బాక అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఎల్లుండి పోలింగ్ జరగనున్న నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాదులోని బేగంపేటలో రూ.1 కోటి స్వాధీనం చేసుకోగా, ఈ డబ్బును తీసుకెళుతున్న సురభి శ్రీనివాసరావు, డ్రైవర్ రవికుమార్ లను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆ డబ్బును తాము దుబ్బాక తీసుకెళుతున్నట్టు సురభి శ్రీనివాసరావు వెల్లడించినట్టు సీపీ అంజనీకుమార్ వెల్లడించారు.

సురభి శ్రీనివాసరావు దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు స్వయానా బావమరిది అని తెలిపారు. బేగంపేటలోని విశాఖ ఇండస్ట్రీస్ సంస్థ మేనేజర్ నుంచి ఆ డబ్బును తీసుకుని దుబ్బాక వెళుతున్నట్టు వెల్లడైందని, విశాఖ ఇండస్ట్రీస్ సంస్థ పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ కు చెందినదని అంజనీ కుమార్ వివరించారు. ఓటర్లకు పంచేందుకు ఈ డబ్బు తరలిస్తున్నట్టు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ఇటీవలే సిద్ధిపేటలో రఘునందన్ మామ, ఇతర బంధువుల నివాసాల్లోనూ పోలీసులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
Raghunandna RaoSrinavasaraoPoliceCashBegumpetHyderabadDubbakaBy Polls

More Telugu News

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35
..more