ధరణి పోర్టల్ ను ప్రారంభించిన సీఎం.. ఇకపై అన్నీ ఈ పోర్టల్ నుంచే!
- మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి పోర్టల్ ప్రారంభం
- ఇకపై అన్ని వివరాలు ఆన్ లైన్లోనే
- రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు అన్నీ పోర్టల్ లోనే
ఇకపై వ్యవసాయ, వ్యవసాయేతర రికార్డులన్నీ ధరణి పోర్టల్ లో ఉండబోతున్నాయి. ప్లాట్ బుకింగ్ నుంచి పాస్ పుస్తకాల వరకు అన్నీ పోర్టల్ లోనే ఉంటాయి. రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు ధరణి పోర్టల్ ద్వారానే జరుగుతాయి. ఈ పోర్టల్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం నిలిపివేసిన సంగతి తెలిసిందే. పోర్టల్ ప్రారంభమైన నేపథ్యంలో నవంబర్ 2 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభంకానుంది.