సిరిమానోత్సవంలో అలక వహించిన సంచయిత
- కోటపై కూర్చున్న సుధ, ఊర్మిళ
- వారిని దింపేయాలన్న సంచయిత
- ఆ పని చేయలేమన్న పోలీసులు
కార్యక్రమం సందర్భంగా ఆనందగజపతిరాజు రెండో భార్య సుధ, కుమార్తె ఊర్మిళ కోటపై కూర్చున్నారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన సంచయిత అక్కడి నుంచి వారిద్దరినీ దింపేయాలని అక్కడున్న పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. అయితే, ఆ పని తాము చేయలేమని పోలీసులు చెప్పడంతో... కోటపై ఏర్పాటు చేసిన వేదికపై మరోవైపు ఉన్న కుర్చీలో ఆమె కూర్చున్నారు. అయితే సంచయిత వ్యవహరించిన తీరుపట్ల సుధ, ఊర్మిళ దీక్షకు సిద్ధపడటంతో అక్కడ పరిస్థితి వేడెక్కింది. ఆనందగజపతిరాజుకు అసలైన వారసురాలిని తానేనని ఈ సందర్భంగా ఊర్మిళ వ్యాఖ్యానించారు.