టీడీపీ కార్యాలయానికి భూ కేటాయింపులపై సుప్రీంలో విచారణ... ఏపీ సర్కారుకు, టీడీపీకి నోటీసులు జారీ
- సుప్రీంలో పిటిషన్ వేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి
- వాగు భూమి కబ్జాచేసి పార్టీ ఆఫీసు కట్టారని ఆరోపణ
- పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు
ఎమ్మెల్యే ఆర్కే తరఫున ప్రశాంత్ భూషణ్, రమేశ్ వాదనలు వినిపించారు. జల వనరులతో సంబంధం ఉన్న భూమిని పార్టీ ఆఫీసుకు కేటాయించారని వారు కోర్టుకు తెలిపారు. జస్టిస్ నారిమన్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ జరిపింది.
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో టీడీపీ జాతీయ కార్యాలయం ఉంది. ఇప్పటికే దీనిపై ఆర్కే రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో, న్యాయం జరగలేదని భావించి సుప్రీంను ఆశ్రయించారు.