స్కూల్ పై తుపాకులతో దాడి... 8 మంది చిన్నారుల దుర్మరణం!
- స్కూల్ పై దాడికి దిగిన ఆగంతకులు
- మరో 12 మందికి గాయాలు
- దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన అధికారులు
"తుపాకుల బులెట్ల కారణంగా కనీసం ఎనిమిది మంది చిన్నారులు మరణించారు. ఈ ఘటనతో మదర్ ఫ్రాన్సిస్కా ఇంటర్నేషనల్ బైలింగువల్ అకాడమీ రక్తసిక్తమైంది" అని యూఎన్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇదే ఘటనలో మరో 12 మంది విద్యార్థులకు గాయాలు కాగా, వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రులకు తరలించామని వెల్లడించారు. ఈ ప్రాంతంలో ఇంతవరకూ ఇంతటి ఘోరమైన ఘటన జరగలేదని దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న ఘర్షణల కారణంగా 2017 నుంచి సుమారు 7 లక్షల మంది తమ ఇళ్లను వదిలేసి వెళ్లిపోయారు. ఈ దాడికి ఫలానా వారు కారణమని అధికారులు కూడా ఇంతవరకూ చెప్పలేకపోవడం గమనార్హం.