రివ్వున దూసుకుపోయిన 'నాగ్' అస్త్రం... గురితప్పకుండా లక్ష్యఛేదన
- రాజస్థాన్ లోని పోఖ్రాన్ రేంజిలో ప్రయోగం
- త్వరలో భారత సైన్యంలోకి నాగ్ యాంటీ టాంక్ మిస్సైల్
- ప్రయోగాల ఊపు పెంచిన డీఆర్డీఓ
ఇవాళ నాగ్ అస్త్రాన్ని ఆఖరిసారిగా పరీక్షించగా, గురితప్పకుండా లక్ష్యాన్ని తాకిందని డీఆర్డీఓ వెల్లడించింది. ఈ ప్రయోగాన్ని రాజస్థాన్ లోని పోఖ్రాన్ రేంజిలో నిర్వహించినట్టు తెలిపింది. గత ఒకటిన్నర నెలల కాలంలోనే డీఆర్డీఓ 12 క్షిపణి ప్రయోగాలు నిర్వహించడం విశేషం. ఇవాళ నిర్వహించిన నాగ్ యాంటీ టాంక్ మిస్సైల్ ప్రయోగం ఓ మొబైల్ లాంచర్ ద్వారా చేపట్టారు.
నాగ్ 4 నుంచి 7 కిలోమీటర్ల పరిధిలోని శత్రు టాంకులను నామరూపాల్లేకుండా చేయగలదు. ఇది మూడవ తరం ఏటీజీఎమ్. పగలు, రాత్రి అని తేడా లేకుండా ఏ సమయంలోనైనా లక్ష్యాలపై దూసుకెళ్లే సత్తా దీని సొంతం.