బ్రెజిల్‌లో కొవిడ్ టీకా పరీక్షల్లో అపశ్రుతి.. టీకా తీసుకున్న వలంటీర్ మృతి
- ఆక్స్‌ఫర్డ్‌తో కలిసి టీకాను అభివృద్ధి చేసిన ఆస్ట్రాజెనెకా
- వలంటీర్ మృతి విషయాన్ని నిర్ధారించిన బ్రెజిల్
- టీకాపై అనుమానాలు అక్కర్లేదన్న ఆక్స్‌ఫర్డ్
మూడో దశలో ఈ టీకాను వేయించుకున్న ఓ వలంటీర్ మృతి చెందినట్టు బ్రెజిల్ ఆరోగ్య విభాగం నిన్న వెల్లడించింది. అయితే, అతడు వ్యాక్సిన్ కారణంగా మరణించాడా? లేక, మరే కారణమైనా ఉందా? అన్న విషయాన్ని వెల్లడించని అధికారులు, పరీక్షలు మాత్రం కొనసాగుతాయన్నారు. కాగా, వ్యాక్సిన్ భద్రతపై ఎటువంటి అనుమానాలు అవసరం లేదని ఆక్స్‌ఫర్డ్ స్పష్టం చేసింది.