బాబ్రీ కూల్చివేతపై ప్రతీకారం తీర్చుకుందాం.. భారత్ పై జీహాద్ ప్రకటించండి: ఐసిస్
- దేశంలో ఒక వర్గాన్ని రెచ్చగొడుతున్న ఐసిస్
- భారత ప్రభుత్వంపై పోరాడాలని పిలుపు
- సీఏఏ నిరసన కార్యక్రమాలను కూడా కొనసాగించాలని సూచన
సీఏఏకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమాలను కూడా కొనసాగించాలని సూచించింది. భారత ప్రభుత్వంపై పోరాటంలో ఇది కూడా ఒక భాగమని తెలిపింది. రహస్య వెబ్ సైట్లు, టెలిగ్రామ్ చానళ్ల ద్వారా ఈ మేరకు విద్వేషపూరిత భావజాలాన్ని ఐసిస్ ఒక వర్గం ప్రజలకు ఎక్కించే ప్రయత్నం చేస్తోంది. బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారం తీర్చుకోవాలని పిలుపునిచ్చింది. ఈ విషయాన్ని ఐసిస్ డిజిటల్ పత్రిక 'వాయిస్ ఆఫ్ హింద్'లో ప్రచురించారు.