దివ్యాంగుడికి త్రిచక్ర వాహనం కోసం తన జీతం నుంచి డబ్బులు ఇచ్చిన మంత్రి నిరంజన్ రెడ్డి
- వనపర్తి జిల్లాలో దివ్యాంగుడికి మంత్రి సాయం
- తన జీతం నుంచి రూ.30 వేలు ఇచ్చిన నిరంజన్ రెడ్డి
- త్రిచక్ర వాహనం కొనుక్కున్న దివ్యాంగుడు
ఈ క్రమంలో ఆ కుటుంబానికి ఆసరాగా ఉండేలా ఓ త్రిచక్ర వాహనం కొనుగోలు కోసం మంత్రి నిరంజన్ రెడ్డి తన జీతం నుంచి రూ.30 వేలు అందించారు. అంతేకాదు, కృష్ణయ్య నూతన త్రిచక్రవాహనంపై కూర్చుండగా, అతడి కుమార్తె నడుపుతున్న దృశ్యాన్ని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైకల్యం అనేది మనుషులకేనని, మనసులకు కాదని, దివ్యాంగులు కూడా ఎవరికీ తక్కువ కాదని, వారిలో ఆత్మవిశ్వాసం నింపడం ద్వారా ప్రోత్సహించాలని అన్నారు.