నితిన్ 'చెక్' నూతన షెడ్యూల్ ప్రారంభం

Nithin new movie Check shooting begins
  • వరుసగా సినిమాలు చేస్తున్న నితిన్
  • చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో చెక్
  • నితిన్ సరసన రకుల్ ప్రీత్, ప్రియా వారియర్
యంగ్ హీరో నితిన్ దూకుడు పెంచాడు. ప్రస్తుతం తను నటిస్తున్న 'రంగ్ దే' చిత్రీకరణ ముగింపు దశలో ఉండగానే, మరో సినిమా 'చెక్' సెట్స్ పైకి వెళ్లింది. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో వస్తున్న 'చెక్' లో నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా వారియర్ నటిస్తున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వి.ఆనందప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

 తాజాగా 'చెక్' సినిమా నూతన షెడ్యూల్ ప్రారంభమైంది. కరోనా ప్రభావంతో ఇన్నాళ్లు షూటింగ్ నిలిచిపోయింది. లాక్ డౌన్ కు ముందే ముహూర్తం షాట్ జరిగినా, కరోనా ప్రభావం ఈ సినిమాపైనా పడింది. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ లుక్ రిలీజవగా, అభిమానుల నుంచి విశేష స్పందన వచ్చింది.
Go Back to Shorts
Nithin
Check
New Movie
Chandrasekhar Yeleti
Shooting
Corona Virus
Lockdown
Tollywood

More Telugu News