ఈ అర్ధరాత్రి నుంచి లండన్ లో కరోనా నిబంధనలు మరింత కఠినతరం.. హై అలర్ట్!
- లండన్ లో పెరుగుతున్న కేసులు
- ప్రతి 10 రోజులకు రెట్టింపవుతున్న కేసులు
- ఎవరూ కూడా మరెవరినీ కలవకూడదని ఆంక్షలు
కామన్ స్పేస్ ను షేర్ చేసుకునే వ్యక్తులు సైతం ఒకరినొకరు కలవకూడదు. ఏదైనా మైదానం వంటి బహిరంగ ప్రదేశంలో ఏదైనా అత్యవసర సమావేశం జరిగినట్టైతే ఆరుగురికి మించి ఉండకూడదు. అదికూడా అన్ని జాగ్రత్తలు తీసుకుని సమావేశాలు జరుపుకోవాలి. ఇదే సమయంలో ప్రతి ఒక్కరూ తమ ప్రయాణాలను వీలైనంత వరకు తగ్గించుకోవాలి.
ఈ సందర్భంగా యూకే ఆరోగ్య మంత్రి మ్యాట్ హ్యాంకాక్ మాట్లాడుతూ, లండన్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయని... ప్రతి 10 రోజులకు కేసులు డబుల్ అవుతున్నాయని చెప్పారు. ఈ పరిస్థితుల్లో కరోనా విస్తరణను నియంత్రించేందుకు నిబంధనలను కఠినతరం చేస్తున్నామని తెలిపారు.