నార్త్ ఇండియా మొత్తం వాయు కాలుష్యంతో బాధపడుతోంది: మనీశ్ సిసోడియా
- వాయు కాలుష్యం ఢిల్లీకే పరిమితం కాలేదు
- కరోనా కూడా తోడు కావడం ప్రమాదకరంగా మారింది
- కేంద్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు
అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఈ పొగ వల్ల ఉత్తరాది మొత్తం ఇబ్బంది పడుతున్నా కేంద్ర ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోందని విమర్శించారు. కాలుష్య నివారణలో కేంద్రం తన వంతు పాత్రను పోషించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎవరి ప్రయత్నం వారు చేస్తే కాని ఈ సమస్యను తగ్గించలేమని అన్నారు. కాలుష్యానికి కరోనా వైరస్ కూడా తోడు కావడం ప్రజలకు ప్రమాదకరంగా మారిందని చెప్పారు.