మద్యం సరఫరాకు టెండర్ వేసిన ఒకే ఒక్క బిడ్డర్ ఎవరు?: దేవినేని ఉమ

devineni uma slams jagan
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. 'మద్యం రవాణాలో అస్మదీయులకు కోట్ల రూపాయలు కట్టబెట్టేలా టెండర్? గతంలో పెట్ కు 18 రూపాయలు. ఇప్పుడు 30 పైనే కోట్. మద్యం సరఫరాకు టెండర్ వేసిన ఒకే ఒక్క బిడ్డర్ ఎవరు? రాష్ట్రమంతా ఒక్కరికే ఎలా ఇస్తారు? అనామక బ్రాండ్లు, నాసి రకం మద్యంతో పాటు రవాణాలోను జరుగుతున్న దోపిడీపై ప్రజలకు సమాధానం చెప్పండి వైఎస్‌ జగన్ గారు' అని దేవినేని ఉమ నిలదీశారు. ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ఓ కథనాన్ని ఆయన పోస్ట్ చేశారు.

డిపోల నుంచి మద్యం రవాణా చేసేందుకు టెండర్లు పిలిచారని, 13 జిల్లాలకు కలిపి ఒకే టెండర్‌ ఉందని ఆ కథనంలో పేర్కొన్నారు. అది కూడా ఒక్కరు మాత్రమే టెండర్‌ వేశారని, అంతేగాక ప్రస్తుతమవుతున్న ఖర్చు కంటే దాదాపు 60 శాతం ఎక్కువ ధర కోట్‌ చేసినట్లు సమాచారం అందిందని అందులో ఆరోపించారు. సింగిల్‌ బిడ్‌ రావడంతో ఇప్పుడు ఈ టెండర్‌ నోటిఫికేషన్‌ను కూడా కనిపించకుండా చేశారని తెలిసిందని అందులో చెప్పారు.
Go Back to Shorts
Devineni Uma
Telugudesam
YSRCP

More Telugu News