నేటి నుంచి ఒడిశా అసెంబ్లీ సమావేశాలు.. డిప్యూటీ స్పీకర్, 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా!
- శాసనసభ్యులు, పాత్రికేయులకు కరోనా పరీక్షలు
- భువనేశ్వర్‌లోని ఓ ఆసుపత్రిలో చేరిన డిప్యూటీ స్పీకర్
- ఇప్పటి వరకు 9 మంది మంత్రులు సహా 50 మంది ఎమ్మెల్యేలకు సోకిన వైరస్
తనకు కరోనా సోకిందని, ప్రస్తుతం భువనేశ్వర్‌లోని ఓ ఆసుపత్రిలో చేరినట్టు డిప్యూటీ స్పీకర్ వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన వారంతా జాగ్రత్తగా ఉండాలని, కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మరోవైపు, ప్రభుత్వ చీఫ్ విప్ ప్రమీల మల్లిక్ ఆదివారం కరోనా బారినపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 9 మంది మంత్రులు సహా 50 మంది ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. వీరిలో పలువురి క్వారంటైన్ సమయం ఇప్పటికే ముగిసింది.