గత 24 గంటల్లో ఏపీలో 48 కరోనా మరణాలు
- రాష్ట్రంలో 5,606కి పెరిగిన కరోనా మృతుల సంఖ్య
- తాజాగా 7,073 కొవిడ్ కేసులు
- మరో 8,695 మందికి కరోనా నయం
తాజాగా 7,073 పాజిటివ్ కేసులు వచ్చాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1,031 కేసులను గుర్తించారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,61,458కి పెరిగింది. ఏపీలో మరో 8,695 మందికి కరోనా నయం అయింది. దాంతో ఇప్పటివరకు కరోనా నుంచి విముక్తులైన వారి సంఖ్య 5,88,169గా నమోదైంది. ఇంకా, 67,683 మంది చికిత్స పొందుతున్నారు.