చిత్ర నిర్మాణ సంస్థ కేసు.. హీరో విశాల్ కి నోటీసులు జారీ చేసిన మద్రాస్ హైకోర్టు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చిత్ర నిర్మాణ సంస్థ కేసు.. హీరో విశాల్ కి నోటీసులు జారీ చేసిన మద్రాస్ హైకోర్టు

Madras HC issues notice to Vishal
  • ట్రైడెంట్ ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా చేసిన విశాల్
  • భారీ నష్టాలను మూటకట్టుకున్న సినిమా
  • తర్వాతి సినిమా మీతోనే చేస్తానని విశాల్ హామీ
హీరో విశాల్ కు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. తన సొంత నిర్మాణ సంస్థ 'విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ' బ్యానర్ పై 'చక్ర' అనే చిత్రాన్ని విశాల్ నిర్మిస్తున్నాడు. ఈ దీపావళికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని విశాల్ నిర్ణయించుకున్నాడు. దక్షిణాది భాషల్లో ఓటీటీలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. అయితే ఈ సినిమా విడుదలను ఆపాలంటూ నిర్మాణ సంస్థ ట్రైడెంట్ ఆర్ట్స్ మద్రాస్ హైకోర్టులో కేసు వేసింది.

విశాల్ తో 'యాక్షన్' అనే చిత్రాన్ని ట్రైడెంట్ ఆర్ట్స్ నిర్మించింది. రూ. 44 కోట్లతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రూ. 20 కోట్ల వరకు గ్యారెంటీ ఉండేలా నిర్మాణ సంస్థకు విశాల్ అగ్రిమెంట్ రాసిచ్చాడు. అయితే ఇరు తెలుగు రాష్ట్రాల్లో రూ. 4 కోట్లు, తమిళనాడులో రూ. 7.7 కోట్లు మాత్రమే ఈ చిత్రం వసూలు చేసిందని, దీంతో తదుపరి చిత్రాన్ని ట్రైడెంట్ బ్యానర్ లోనే చేస్తానని విశాల్ హామీ ఇచ్చాడట. కానీ, తన సొంత బ్యానర్ లోనే విశాల్ సినిమాను నిర్మించారు. దీంతో ట్రైడెంట్ ఆర్ట్స్ హైకోర్టును ఆశ్రయించింది.

తమకు విశాల్ రూ. 8.29 కోట్లు బాకీ ఉన్నాడని...  సినిమా విడుదలను ఆపాలని కోర్టును కోరింది. కేసును విచారించి హైకోర్టు విశాల్ కు నోటీసులు జారీ చేసింది.
Madras High Court
Vishal
Notices
Tollywood

More Telugu News