భవనం కుప్పకూలిన ఘటనలో 17కు చేరిన మృతుల సంఖ్య
- నిన్న తెల్లవారుజామున కుప్పకూలిన భవనం
- రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
- రూ. 5 లక్షల పరిహారం ప్రకటించిన ఉద్ధవ్ ప్రభుత్వం
ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, బాధిత కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి ట్వీట్ చేయగా, ఇది విచారకరమని, బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రధాని ట్వీట్ చేశారు. మరోవైపు, బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున సాయం అందించనున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. భవనం శిథిలావస్థకు చేరుకోవడం వల్లే కుప్పకూలినట్టు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.