ఆంజనేయస్వామి విగ్రహం కాళ్లకు మొక్కి.. ఆ తర్వాత హుండీ దోచేశారు!
- మండపేటలో హుండీని దోచుకున్న దొంగలు
- చోరీకి పాల్పడ్డ ముగ్గురు యువకులు
- సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాలు
బైక్ మీద వచ్చిన ముగ్గురు యువకులు ఆంజనేయస్వామి కాళ్లకు మొక్కారు. అనంతరం అక్కడున్న హుండీని బద్దలు కొట్టి, అందులోని సొమ్మును దోచుకుపోయారు. ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు వీడియో ఫుటేజీని పరిశీలించారు. ఈ ఫుటేజ్ ఆధారంగా దొంగలను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. మరోవైపు, గుడిలో ఉన్న హుండీని దోచుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.