Sushant Singh Rajput: ఈ విగ్రహం చూస్తుంటే మా అన్నయ్య తిరిగొచ్చినట్లుంది: సుశాంత్ సోదరి శ్వేత

Felt as if Bhai came Alive says sweta
షార్ట్స్‌లో చూడండి
బాలీవుడ్ యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో కేంద్ర దర్యాప్తు బృందం విచారణ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఆయన మృతి కేసు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో ఓ కళాకారుడు సుశాంత్ మైనపు విగ్రహాన్ని రూపొందించగా అందుకు సంబంధించిన వీడియోను సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ చూసింది. ఈ వీడియోను ఆమె తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. ‌ భావోద్వేగభరిత వ్యాఖ్య చేసింది.

'ఈ విగ్రహం చూస్తుంటే మా అన్నయ్య తిరిగొచ్చినట్లుంది' అని ఆమె పేర్కొంది. ఈ విగ్రహాన్ని రూపొందించిన కళాకారుడు సుశాంత రాయ్‌ (64)కి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆమె తెలిపింది. కాగా, ఈ విగ్రహాన్ని త్వరలోనే ఓ మ్యూజియంలో పెట్టనున్నారు. దీన్ని నెలన్నరపాటు కష్టపడి తయారు చేశారు.

తనకు ఎమోషనల్‌గా దగ్గరైన వ్యక్తుల విగ్రహాలతో పాటు తనలో స్ఫూర్తి నింపిన ప్రముఖుల విగ్రహాలను తాను రూపొందిస్తుంటానని సుశాంత రాయ్‌ తెలిపారు. సుశాంత్ కూడా అటువంటి వ్యక్తేనని, అయితే, ఈ విగ్రహాన్ని చూసేందుకు ఆయన లేకపోవడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నానని అన్నారు.
Go Back to Shorts
Sushant Singh Rajput
Bollywood
Twitter
Viral Videos

More Telugu News