తెలుగు వెబ్ సీరీస్ లో తమన్నా.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలుగు వెబ్ సీరీస్ లో తమన్నా.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం!

Tamanna gives nod to Web Series in Telugu
  • భారీ పారితోషికాలతో ఆకర్షిస్తున్న డిజిటల్ రంగం 
  • ఇప్పటికే వెబ్ సీరీస్ చేస్తున్న సమంత, కాజల్  
  • థ్రిల్లర్ జోనర్లో ఎనిమిది భాగాలుగా తమన్నా సీరీస్
ఇటీవలి కాలంలో డిజిటల్ ఫీల్డుకి క్రేజ్ బాగా పెరిగింది. అందులోనూ ఈ లాక్ డౌన్ లో థియేటర్లు లేకపోవడంతో ఓటీటీలదే హవా అన్నట్టుగా వుంది. దీంతో పలు ఓటీటీ కంపెనీలు కోట్లకు కోట్లు ఇన్వెస్ట్ చేస్తూ సినిమాలతో పాటు వెబ్ సీరీస్ పై కూడా దృష్టి పెడుతున్నాయి.

ఈ క్రమంలో భారీ పారితోషికాలను ఆఫర్ చేస్తూ ప్రముఖ తారలను, ఫిలిం మేకర్స్ ను అటువైపు ఆకర్షిస్తున్నాయి. మంచి పారితోషికం వస్తుండడంతో టాప్ హీరోయిన్లు సైతం వీటి పట్ల ఆసక్తి చూపుతూ అటువైపు అడుగేస్తున్నారు. ఇప్పటికే తెలుగు నుంచి కాజల్, సమంత వెబ్ సీరీస్ లో నటిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఓ తెలుగు వెబ్ సీరీస్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆమధ్య 'గరుడ వేగ' వంటి హిట్ చిత్రాన్ని రూపొందించిన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ వెబ్ సీరీస్ రూపొందనుంది. థ్రిల్లర్ జోనర్ లో ఈ వెబ్ సీరీస్ 8 భాగాలుగా రూపొందుతుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సీరీస్ షూటింగ్ మొదలవుతుంది.

ఇదిలావుంచితే, తమన్నా ప్రస్తుతం తెలుగులో గోపీచంద్ తో 'సీటీమార్', సత్యదేవ్ తో 'గుర్తుందా శీతాకాలం' చిత్రాలతో పాటు హిందీలో 'బోల్ చుడియాన్' చిత్రంలో కూడా నటిస్తోంది.  
Tamannaah
Web Series
Praveen Sattaru

More Telugu News