వేరే దేశాలకు లేని సమస్య అమెరికాకు మాత్రమే ఉంది: డొనాల్డ్ ట్రంప్!
- అమెరికా అడవుల్లో తరచూ మంటలు
- ఇటీవలే ప్రాణాలు కోల్పోయిన 35 మంది
- ఇదేమీ సైన్స్ కు సంబంధించినది కాదన్న ట్రంప్
ఆపై, మీడియాతో మాట్లాడుతుండగా, వాతావరణ మార్పుల కారణంగానే అడవులు మండుతున్నాయా? అన్న ప్రశ్న ఎదురైన వేళ, ట్రంప్ స్పందించారు. అన్ని దేశాల్లో మంటలు అంటుకునే చెట్లు ఉన్నాయని, కానీ, అమెరికాలో ఉన్న సమస్య, వేరే దేశాల్లో లేదని అన్నారు. త్వరలోనే ఈ మంటలు చల్లారుతాయని వెల్లడించిన ఆయన, ఇదేమీ వాతావరణ మార్పులతో వచ్చిన సమస్య కాదని, మేనేజ్ మెంట్ కు సంబంధించిన విషయమని అభివర్ణించారు. అడవుల్లో మంటలకు సైన్స్ కు సంబంధం ఉందని తాను భావించడం లేదని స్పష్టం చేశారు.