ప్రభాస్ 'ఆదిపురుష్'లో సీతగా అనుష్క శర్మ?

Anushka Sharma in Adipurush
  • ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ 'ఆదిపురుష్'
  • అనుష్కకు కథ వినిపించిన దర్శకుడు
  • జనవరిలో డెలివరీ.. రెండు నెలల తర్వాత షూటింగుకి
  • ఈలోగా ప్రభాస్, ఇతరులపై చిత్రీకరణ    
ఇంతకీ సీత ఎవరు?
ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కువగా చర్చలలో వున్న టాపిక్ ఇదే. ప్రభాస్ డైరెక్టుగా నటిస్తున్న హిందీ చిత్రం 'ఆదిపురుష్' సినిమాకు సంబంధించి గత కొన్ని రోజులుగా మీడియాలో కూడా ఇదే టాపిక్ పై వార్తలొస్తున్నాయి. మొదట్లో కీర్తి సురేశ్ .. తర్వాత కియారా అద్వానీ.. ఆ తర్వాత ఊర్వశి రౌటేలా.. వంటి పేర్లు వినిపించగా, ఇక ఇప్పుడు తాజాగా అనుష్క శర్మ పేరు ఒక్కసారిగా గుప్పుమంది.

ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా రూపొందే ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, సైఫ్ అలీఖాన్ లంకేశ్ గా నటిస్తున్నారు. అయితే, సీత పాత్ర విషయంలోనే రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా అనుష్క శర్మ దాదాపు ఖరారైందని బాలీవుడ్ మీడియా కూడా వార్తలు ఇస్తోంది. అనుష్కను ఇటీవల దర్శకుడు ఓం రౌత్ కలసి కథ, ఆమె పాత్ర గురించి వివరించి చెప్పాడని, ఆమె హ్యాపీగా ఒప్పుకుందని అంటున్నారు.

అయితే, అనుష్క ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా? ఆమె ఎలా ఒప్పుకుని వుంటుంది? అన్న డౌట్ మనకు రావడం సహజం. అది నిజమే.. అనుష్కకు జనవరిలో డెలివరీ అవుతుంది. ఈ విషయాన్ని కోహ్లీ ఇప్పటికే ప్రకటించాడు. ఇక 'ఆదిపురుష్' సినిమా షూటింగ్ కూడా జనవరిలోనే మొదలవుతుంది. ముందుగా ప్రభాస్, ఇతర తారాగణంపై సన్నివేశాల భాగాన్ని పూర్తిచేస్తారట. డెలివరీ అయిన రెండు నెలల తర్వాత తాను షూటింగుకి రెడీ అయిపోతానని అనుష్క చెప్పిందట. సో.. ఆ ప్రకారం ఆమె షూటింగును ప్లాన్ చేస్తారని అంటున్నారు. అనుష్క కూడా పొడగరే కాబట్టి ప్రభాస్ పక్కని సరిగ్గా సూటవుతుందనే చెప్పచ్చు!
   
Go Back to Shorts
Anushka Sharma
Prabhas
Om Routh
Virat Kohli

More Telugu News