రియా చక్రవర్తి జైలుకు తరలింపు.. నేరం నిరూపితమైతే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష!
- రియా బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన కోర్టు
- డ్రగ్స్ సిండికేట్ లో రియా కీలక సభ్యురాలు అన్న ఎన్సీబీ
- ముంబైలోని బైకుల్లా జైలుకు తరలింపు
కోర్టులో రియాకు బెయిల్ ఇవ్వకూడదని ఎన్సీబీ వాదించింది. కోర్టుకు అందజేసిన నివేదికలో రియాపై తీవ్ర అభియోగాలను మోపింది. డ్రగ్స్ సిండికేట్ లో రియా కీలక సభ్యురాలు అని తెలిపింది. ప్రతి డ్రగ్ డెలివరీ, పేమెంట్ వివరాలు ఆమెకు తెలుసని చెప్పింది. శామ్యూల్ మిరండా, దీపేశ్ సావంత్ కూడా సుశాంత్ కు డ్రగ్స్ సరఫరా చేసేవారని... వాటికి సుశాంత్, రియా ఇద్దరూ డబ్బులు చెల్లించేవారని వారిద్దరూ వెల్లడించారని తెలిపింది. మరోవైపు ఈ ఆరోపణలు నిరూపితమైతే చట్టం ప్రకారం రియాకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.