ఉద్ధవ్ థాకరే తర్వాత.. శరద్ పవార్ కు బెదిరింపు కాల్స్!
- నిన్న రాత్రి థాకరే నివాసానికి దుబాయ్ నుంచి కాల్
- ఈరోజు పవార్, అనిల్ దేశ్ ముఖ్ లకు కాల్స్
- విదేశాల నుంచి వచ్చిన బెదిరింపు కాల్స్
దావూద్ అనుచరుడి పేరిట థాకరేకు దుబాయ్ నుంచి నిన్న రాత్రి 10.30 గంటలకు కాల్ వచ్చింది. సీఎంతో దావూద్ మాట్లాడాలనుకుంటున్నారని ఫోన్ లోని వ్యక్తి చెప్పాడని... అయితే టెలిఫోన్ ఆపరేటర్ ఆ కాల్ ను సీఎంకు ట్రాన్స్ ఫర్ చేయలేదని అధికారులు తెలిపారు. ఏదేమైనప్పటికీ రాజకీయ ప్రముఖులకు ఇలాంటి కాల్స్ రావడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.