ఏపీ 'ఎస్ఈసీ'పై సీఐడీ నమోదు చేసిన కేసుపై హైకోర్టులో విచారణ
- క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్
- విచారణ నిలిపివేయాలంటూ సీఐడీని ఆదేశించిన కోర్టు
- తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా
ఆపై, విచారణ చేపట్టిన హైకోర్టు... సీఐడీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. విచారణ ప్రక్రియలో ముందుకు వెళ్లొద్దని ఆదేశించింది. ఈ కేసులో విచారణ ఎవరిపై, ఎందుకు చేస్తున్నారో వివరాలు తెలపాలని పేర్కొంది. ఈ కేసులో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసేంతవరకు తదుపరి చర్యలు నిలిపివేయాలని సీఐడీకి స్పష్టం చేసింది. కేసు తదుపరి విచారణను హైకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.