భారత్‌పై పాక్ కుటిలయత్నం.. తిప్పికొట్టిన భద్రతా మండలి!
- కొందరు భారతీయులను తీవ్రవాదులుగా చిత్రీకరించే యత్నం
- విదేశాల్లో అభివృద్ధి ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న వారిపై అనుమానాలు
- వారిని తీవ్రవాదుల జాబితాలో చేర్చాలని విజ్ఞప్తులు
- అడ్డుకున్న భద్రతామండలి సభ్యదేశాలు
విదేశాల్లో పలు అభివృద్ధి ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న వారిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వారిని తీవ్రవాదుల జాబితాలో చేర్చాలని కోరింది. చివరకు ఆ ఆరోపణలపై భద్రతా మండలికి పాకిస్థాన్ ఆధారాలు ఇవ్వలేకపోయింది. దీంతో పాకిస్థాన్ చర్యను అమెరికా సహా బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం అడ్డుకున్నాయి. కాగా, భారత్‌పై పాక్ ఇటువంటి కుట్రలు పన్నడం కొత్తేమీకాదు. ఇద్దరు భారతీయులను తీవ్రవాద జాబితాలో చేర్చాలని గత ఏడాది కూడా ప్రయత్నాలు జరపగా అవి కూడా ఫలించలేదు.