ఈసారి ఐపీఎల్ కు రాలేనన్న మలింగ... ఆసీస్ పేసర్ ను పిలిపించిన ముంబయి ఇండియన్స్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈసారి ఐపీఎల్ కు రాలేనన్న మలింగ... ఆసీస్ పేసర్ ను పిలిపించిన ముంబయి ఇండియన్స్

Lasith Malinga out of IPL for this season
  • కుటుంబంతో ఉండాలని మలింగ నిర్ణయం
  • మలింగ నిర్ణయానికి తమ మద్దతు ఉంటుందన్న ఆకాశ్ అంబానీ
  • మలింగ స్థానంలో ఆసీస్ పేసర్ జేమ్స్ ప్యాటిన్సన్ కు అవకాశం
శ్రీలంక వెటరన్ పేస్ బౌలర్ లసిత్ మలింగ ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ కు అనేక చిరస్మరణీయ విజయాలు అందించాడు. అయితే వ్యక్తిగత కారణాలతో ఈసారి ఐపీఎల్ సీజన్ కు దూరం అవుతున్నట్టు మలింగ ప్రకటించడంతో ముంబయి ఇండియన్స్ శిబిరంలో నిరాశ అలముకుంది. అయితే, రిజర్వ్ బెంచ్ ఎంతో పటిష్టంగా ఉన్న ముంబయి జట్టు ఆస్ట్రేలియా పేసర్ జేమ్స్ ప్యాటిన్సన్ తో మలింగ స్థానాన్ని భర్తీ చేయాలని నిర్ణయించింది.

దీనిపై ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ ఓనర్ ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ, శ్రీలంకలోని తన కుటుంబంతోనే ఉండాలని మలింగ నిర్ణయించుకున్నాడని, అతడి అభిప్రాయాలకు విలువ ఇస్తామని తెలిపారు. ముంబయి ఇండియన్స్ ఓ జట్టు మాత్రమే కాదని, విలువలున్న ఓ కుటుంబం అని వివరించారు. మా ఇంటి సభ్యుడి వంటి మలింగకు కచ్చితంగా మద్దతుగా నిలుస్తామని పేర్కొన్నారు. మలింగ స్థానంలో ఆసీస్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ప్యాటిన్సన్ ను తీసుకుంటున్నామని, ప్యాటిన్సన్ ముంబయి జట్టు అవసరాలకు  తగినవాడని భావిస్తున్నామని వివరించారు.
Lasith Malinga
IPL 2020
James Pattinson
UAE
Sri Lanka

More Telugu News