మా నాన్న నిదానంగా కోలుకుంటున్నారు: బాలు తనయుడు ఎస్పీ చరణ్

  • ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి వివరించిన తనయుడు చరణ్
  • ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడి
  • చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స
ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై ఆయన తనయుడు ఎస్పీ చరణ్ ట్విట్టర్ లో స్పందించారు. తన తండ్రి ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆయన నిదానంగా కోలుకుంటున్నారని వెల్లడించారు. చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపారు.

ఎస్పీ బాలు ఆగస్టు 5న కరోనాతో చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత కొన్నిరోజులకే ఆయన పరిస్థితి విషమించడంతో ఐసీయూకి తరలించి వెంటిలేటర్ అమర్చారు. అటుపై ఎక్మో సాయం అందిస్తూ వచ్చారు. గత కొన్నిరోజులుగా ఆయన ఆరోగ్యం మెరుగవుతోందని, కొద్దిమేర ఫిజియోథెరపీ అందిస్తున్నారని, పూర్తిగా స్పృహలోనే ఉన్నారని ఎంజీఎం ఆసుపత్రి వర్గాలను ఉటంకిస్తూ ఎస్పీ చరణ్ వెల్లడించారు. అటు, ఎస్పీ బాలు భార్య కూడా కరోనా బారినపడ్డారు. ఆమె కూడా చికిత్స పొందుతున్నారు.

SP Balasubrahmanyam
Health
Corona Virus
MGM Hospital
Chennai
SP Charan
Tollywood

More Telugu News