రేపు వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి.. నేడు ఇడుపులపాయకు జగన్

CM YS Jagan today leave for Idupulapaya
  • సాయంత్రం 5.16 గంటలకు గన్నవరం నుంచి కడప వెళ్లనున్న సీఎం
  • రేపు ఉదయం 9.45 గంటలకు కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్‌కు నివాళులు
  • రేపు మధ్యాహ్నం తిరిగి తాడేపల్లికి
రేపు ఇడుపులపాయలో జరగనున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇడుపులపాయ వెళ్లనున్నారు. నేటి సాయంత్రం నాలుగు గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి కడపకు వెళ్తారు. సాయంత్రం 5.16 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఎస్టేట్‌కు చేరుకుంటారు. రేపు ఉదయం 9.45 గంటలకు వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకుని కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పిస్తారు. అనంతరం జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు జగన్ తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.
Go Back to Shorts
YS Jagan
YS Rajasekhara Reddy
Idupulapaya
death anniversary

More Telugu News