ఏపీ కరోనా అప్ డేట్స్: 24 గంటల్లో 85 మరణాలు, 10,004 కొత్త కేసులు

Corona details of Andhra Pradesh
  • మరోసారి 10 వేలకు పైగా కొత్త కేసులు
  • తాజాగా 8,772 మందికి కరోనా నయం
  • నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 12 మంది మృతి
ఏపీలో కరోనా వైరస్ స్వైరవిహారం చేస్తోంది. మరోమారు 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు వచ్చాయి. అదే సమయంలో 85 మంది మృత్యువాత పడ్డారు. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 12 మంది మరణించారు. దాంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 3,969కి పెరిగింది.

గత 24 గంటల్లో 56,490 శాంపిల్స్ పరీక్షించగా 10,004 మందికి కరోనా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి (1,383), పశ్చిమ గోదావరి (1,142), నెల్లూరు (1,086), శ్రీకాకుళం (1,023) జిల్లాల్లో వెయ్యికి పైగా కేసులు వచ్చాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,34,771కి చేరింది.

తాజాగా 8,772 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇంకా 1,00,276 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 3,30,526 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Deaths
Positive Cases
COVID-19

More Telugu News