ఏపీలో కరోనా తీవ్రం... పదివేలకు ఏమాత్రం తగ్గనంటున్న కొత్త కేసులు!

Corona pandemic rattles AP as more positive cases foound
  • గత 24 గంటల్లో 10,603 మందికి పాజిటివ్
  • 88 మంది మృతి
  • తాజాగా 9,067 మంది డిశ్చార్జి
ఏపీలో కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తోంది. రాష్ట్రంలో మరోసారి 10 వేలకు పైగా కొత్త కేసులు వెల్లడయ్యాయి. గడచిన 24 గంటల్లో 88 మంది మృత్యువాత పడగా, 10,603 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. నెల్లూరు జిల్లాలో 14, చిత్తూరు జిల్లాలో 12, కడప జిల్లాలో 9 కొవిడ్ మరణాలు సంభవించాయి. ఇతర జిల్లాల్లోనూ కరోనా మహమ్మారి మృత్యుఘోష వినిపిస్తోంది. ఈ క్రమంలో ఏపీలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 3,884కి పెరిగింది.

తాజాగా 9,067 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దాంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య3,21,754కి పెరిగింది. రాష్ట్రంలో నేటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,24,767 కాగా, ఇంకా 99,129 మంది చికిత్స పొందుతున్నారు.

Go Back to Shorts
Corona Virus
Andhra Pradesh
Positive Cases
Deaths
COVID-19

More Telugu News