కొత్త సమాచారం ఏమీ లేదు: ఎస్పీ బాలు ఆరోగ్యంపై చరణ్ స్పందన

SP Charan says no new news about his father SP Balasubrahmanyam health condition
  • కరోనాతో పోరాడుతున్న ఎస్పీ బాలు
  • ఎంజీఎం ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స
  • చికిత్సకు స్పందిస్తున్నారన్న ఎస్పీ చరణ్
ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై ఆయన తనయుడు ఎస్పీ చరణ్ స్పందించారు. తన తండ్రి ఆరోగ్యం నిలకడగా ఉందని, కొత్త సమాచారం ఏమీ లేదని వెల్లడించారు. చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపారు. తన తండ్రి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు చరణ్ పేర్కొన్నారు. గానగంధర్వుడు ఎస్పీ బాలు కొన్నివారాలుగా కరోనా మహమ్మారితో పోరాడుతూ చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆగస్టు 5న ఆయన ఆసుపత్రిలో చేరగా, ఆ తర్వాత కొన్నిరోజులకే పరిస్థితి విషమించడంతో ఐసీయూకి తరలించారు. అప్పటినుంచి వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. ఆయనకు ఎక్మో సాయం కూడా అందిస్తున్నారు.
Go Back to Shorts
SP Balasubrahmanyam
Corona Virus
Positive
SP Charan
MGM Hospital
Chennai

More Telugu News