చైనాలో క్రమంగా మాయమవుతున్న కరోనా.. పూర్తిస్థాయిలో పాఠశాలలు తెరిచేందుకు ప్రభుత్వం రెడీ!
- కరోనా వైరస్ కారణంగా మూతపడిన పాఠశాలలు
- నిన్న కొత్తగా 9 మందికి కరోనా పాజిటివ్
- స్థానికులు ఎవరూ లేరన్న ప్రభుత్వం
కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండడంతో ఇటీవల ప్రభుత్వం బడులు తెరిచింది. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటి కొవిడ్ నిబంధనలతో తరగతులు నిర్వహిస్తోంది. అయితే, ఇంకా 25 శాతం మంది స్కూళ్లకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే వారం నుంచి పూర్తిస్థాయిలో పాఠశాలలు తెరవాలని నిర్ణయించింది. మరోవైపు, రాజధాని బీజింగ్‌లో అన్ని విద్యా సంస్థలకు చెందిన 6 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు.