ఎస్పీ బాలుకు ఫిజియోథెరపీ... కోలుకుంటున్నారన్న తనయుడు
- బాలుకు చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స
- తన తండ్రి ఆరోగ్యం నిలకడగానే ఉందన్న చరణ్
- అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలుపుతూ వీడియో సందేశం
తన తండ్రి క్రమంగా కోలుకుంటున్నారని, ఇవాళ ఆయనకు ఫిజియోథెరపీ కూడా నిర్వహించారని వెల్లడించారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఇంతకుమించి శుభవార్త అంటూ ఏమీలేదని పేర్కొన్నారు. మెరుగైన చికిత్స అందిస్తున్న ఎంజీఎం ఆసుపత్రి వర్గాలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని తెలిపారు. తన తండ్రి కోసం ప్రార్థనలు చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు అంటూ ఎస్పీ చరణ్ ఓ వీడియో సందేశంలో తెలిపారు. మున్ముందు మరిన్ని వివరాలు తెలియజేస్తానని చెప్పారు.