సోనియాకు 23 మంది సీనియర్లు లేఖ రాయడం దురదృష్టకరం: రేవంత్ రెడ్డి
- మీపైన, రాహుల్ నాయకత్వంపైన పూర్తి నమ్మకం ఉంది
- పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత మీది
- కాంగ్రెస్ కు మీరు తప్ప మరెవరూ న్యాయం చేయలేరు
గతంలో కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు పార్టీ పగ్గాలను చేపట్టి, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత మీదని చెప్పారు. మీవల్లే తామంతా పార్టీలో ఎదిగామని అన్నారు. ప్రధాని మోదీ విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారని... దీని వల్ల దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడిందని చెప్పారు. దేశానికి మీ నాయకత్వం, రాహుల్ లీడర్ షిప్ చాలా అవసరమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి మీరు తప్ప మరెవరూ న్యాయం చేయలేరని చెప్పారు.