అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న 139 మందిలో పలువురు ప్రముఖులు... కేసు విషయంలో పంజాగుట్ట పోలీసులకు తలనొప్పి!

24-08-2020 Mon 09:37 | Both States
  • నిన్న పోలీసులకు ఫిర్యాదు
  • నేడు ఉన్నతాధికారుల సమావేశం
  • కేసును సీఐడీకి అప్పగించే అవకాశం
తనపై 139 మంది అత్యాచారానికి పాల్పడ్డారని ఓ యువతి, పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించగా, ఈ కేసు విచారణను ఎలా కొనసాగించాలి?ఎవరికి అప్పగించాలన్న విషయం ఇప్పుడు పోలీసులకు తలనొప్పిగా మారింది. ఆమె ఫిర్యాదు చేసిన వారిలో పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు ఉండటమే ఇందుకు కారణం. అందరి దృష్టీ ఈ కేసుపై పడగా, దర్యాఫ్తు అధికారిగా ఎవరిని ఉంచాలన్న విషయమై నేడు నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.

గడచిన తొమ్మిదేళ్లుగా తనపై అత్యాచారాలు జరుగుతున్నాయని, పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, మీడియా వారు లైంగికంగా వేధించారని మిర్యాలగూడకు చెందిన ఓ యువతి పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో లీగల్ ఎక్స్ పర్ట్స్ సలహా లేకుండా ముందుకు వెళ్లరాదని పోలీసు అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. నేడు సమావేశం కానున్న ఉన్నతాధికారులు, డీజీపీ అనుమతిస్తే, సీఐడీ చేతికి కేసును ఇవ్వాలని భావిస్తున్నారు.

ప్రస్తుతం బాధితురాలిని ఓ స్వచ్ఛంద సేవా సంస్థలో ఉంచి, నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు. ఆమె మానసిక ఒత్తిడితో ఉందని వెల్లడించిన ఇన్ స్పెక్టర్ నిరంజన్ రెడ్డి, మహిళా అధికారుల సహాయంతో ఆమెను ప్రశ్నించి, మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓ ఏసీపీని, ఆయనకు సహాయంగా నలుగురు ఇన్ స్పెక్టర్ల బృందానికి కేసును అప్పగించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
PunjaguttaHyderabadPoliceRapeCaseCID

More Telugu News

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44
..more