మూసీ ప్రాజెక్టు అందాలు చూసేందుకు వెళ్లి.. అందులో పడి యువకుడి మృతి

Young man died in Musi River in Nalgonda
  • స్నేహితులతో కలిసి మూసీ ప్రాజెక్టు వద్దకు వెళ్లిన యువకుడు
  • దిగువకు వెళ్తున్న నీటిలో ఆడుకుంటూ పట్టుతప్పి పడిపోయిన వైనం
  • నీటిలో కొట్టుకుపోయి బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయి మృతి చెందిన యువకుడు
మూసీ నది అందాలు తిలకించేందుకు స్నేహితులతో కలిసి వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు అందులో పడి కొట్టుకుపోయి మృతి చెందాడు. నల్గొండ జిల్లాలో జరిగిందీ ఘటన. భారీ వర్షాలతో నది పొంగిపొర్లుతుండడంతో మూసీ ప్రాజెక్టు గేట్లను అధికారులు ఎత్తివేశారు.

విషయం తెలిసిన నకిరేకల్‌కు చెందిన పుట్టల సాయి (26) ఆ అందాలు చూద్దామని తన స్నేహితులతో కలిసి నిన్న డ్యామ్ వద్దకు వెళ్లాడు. రెండు గేట్ల ద్వారా దిగువకు వెళ్తున్న నీటిలో దిగి మిత్రులతో కలిసి సరదాగా ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పట్టుతప్పి అందులో పడిపోయాడు. వరద ఉద్ధృతికి నదిలో కొట్టుకుపోయాడు. కొంతదూరం వెళ్లిన తర్వాత బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయి మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Nalgonda District
Musi project
Telangana
Man
died

More Telugu News