ఏపీ కరోనా అప్ డేట్: 24 గంటల్లో 93 మంది మృత్యువాత
- 3,282కి పెరిగిన కరోనా మరణాలు
- కొత్తగా 7,895 పాజిటివ్ కేసులు
- 7,449 మందికి కరోనా నయం
ఇక, కొత్తగా 7,895 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే 1,256 కేసులు గుర్తించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,53,111కి చేరగా, తాజాగా 7,449 మంది కోలుకున్నారు. దాంతో ఇప్పటివరకు 2,60,087 మంది సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 89,742 మంది చికిత్స పొందుతున్నారు.