గురుగ్రామ్‌లో ఘోర ప్రమాదం.. అర్ధరాత్రి కూలిన నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్
- 6 కిలోమీటర్ల పొడవున రూ. 2 వేల కోట్ల వ్యయంతో బ్రిడ్జి నిర్మాణం
- అర్ధ రాత్రి కావడంతో తప్పిన పెను ప్రమాదం
- కొనసాగుతున్న శిథిలాల తొలగింపు ప్రక్రియ
రాజీవ్ చౌక్ నుంచి గురుగ్రామ్‌లోని సోహ్నా వరకు 6 కిలోమీటర్ల పొడవున రూ. 2 వేల కోట్ల వ్యయంతో ఈ ఫ్లైఓవర్‌ను నిర్మిస్తున్నారు. ఓరియంటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఈ నిర్మాణ పనులను చేపట్టింది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఫ్లై ఓవర్ ఎలివేటెడ్ రోడ్డులోని కొంత భాగం కూలిపోయిందని ఓరియంటల్ కంపెనీ ప్రాజెక్ట్ హెడ్ శైలేష్ సింగ్ తెలిపారు.