Bollywood: సినీ నటి సోనాక్షి సిన్హాపై సోషల్ మీడియాలో అసభ్య వ్యాఖ్యలు.. యువకుడి అరెస్ట్

Sonakshi Sinhas cyber bully arrested
షార్ట్స్‌లో చూడండి
బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటి సోనాక్షి సిన్హాపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన యువకుడిని ముంబై పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన 27 ఏళ్ల యువకుడు సోనాక్షిని అసభ్య పదజాలంతో దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. అది చూసిన నటి అతడిపై ముంబై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని నిన్న అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలిసిన సోనాక్షి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో ఇటువంటి వాటిని తాను సహించబోనని తెలిపింది. ఆన్‌లైన్ మాధ్యమం సురక్షితంగా ఉండేంత వరకు తాను నిశ్శబ్దంగా ఉండలేనని పేర్కొంది. అందుకనే తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని, వెంటనే స్పందించి చర్యలు తీసుకున్న ముంబై సైబర్ క్రైం పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని పేర్కొంది. ఆన్‌లైన్ వేధింపులకు గురైన వారు ముంబై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయాలని సోనాక్షి సూచించింది.
Go Back to Shorts
Bollywood
Sonakshi Sinha
Cyber crime
Mumbai

More Telugu News