నిజమైన భావోద్వేగాలు... అసలైన వినోదం... వస్తోంది బిగ్ బాస్ సీజన్-4: సరికొత్త ప్రోమోలో నాగ్ సందడి
- త్వరలో బిగ్ బాస్-4
- తాజా ప్రోమోలో నాగ్ ట్రిపుల్ యాక్షన్
- ఇలాంటి వినోదం ఎప్పుడూ చూసివుండరన్న నాగ్
వృద్ధుడి వేషంలో నాగ్ తో పాటు కుర్ర నాగ్ కూడా బయటి ప్రపంచాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ దశలో బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరించే నాగార్జున వచ్చి దీన్ని మించిన ఎంటర్టయిన్ మెంట్ మరొకటి ఉందని, అదే బిగ్ బాస్ సీజన్-4 అంటూ చెబుతాడు. అసలైన భావోద్వేగాలు, నిజమైన వినోదం... ఇంతకుముందెప్పుడూ చూసి ఉండరు అంటూ వ్యాఖ్యానిస్తాడు. మొత్తమ్మీద ఈ ప్రోమోతో బిగ్ బాస్-4 హైప్ మరింత అధికమైంది.