వచ్చే నెలలో పంచాయతీ ఎన్నికలు: జానా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వచ్చే నెలలో పంచాయతీ ఎన్నికలు: జానా

పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలే గ్రామస్వరాజ్యానికి పునాది అని మంత్రి జానారెడ్డి తెలిపారు. రిజర్వేషన్లలో తలెత్తిన ఇబ్బందుల వల్లే స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో నిర్వహించలేదని పేర్కొన్నారు. హైదరాబాద్ యూసుఫ్ గూడ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన మరో నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు. జూన్ చివరి లేదా జూలై మొదటి వారంలో గ్రామపంచాయతీ ఎన్నికలు, ఆగష్టులో జడ్పీ ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. స్థానిక ఎన్నికలకోసం పార్టీ కార్యకర్తలు ఇప్పటి నుంచే కృషి చేయాలని సూచించారు.

More Telugu News