సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులపై ఉక్కుపాదం: తెలంగాణ డీజీపీ
- బెంగళూరు ఘటన నేపథ్యంలో అప్రమత్తం
- అసభ్యకర, అసత్య పోస్టులు పెట్టొద్దని సూచన
- అటువంటి వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశం
సోషల్ మీడియాపై పోలీసుల నిఘా ఎల్లవేళలా కొనసాగుతుందని, అసభ్యకర, అల్లర్లకు కారణమయ్యే పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదు చేయాలని అన్ని పోలీస్ స్టేషన్ల స్టేషన్ హౌస్ ఆఫీసర్ల (ఎస్‌హెచ్ఓ)కు డీజీపీ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని, వివాదాస్పద, శాంతిభద్రతలకు భంగం కలిగించే అసత్య పోస్టులను పెట్టొద్దని డీజీపీ సూచించారు.